1. కిందివాటిలో వ్యతస్థబంధ పాలిమర్ ఏది?
1) పాలిథీన్
2) పీవీసీ
3) బేకలైట్
4) నైలాన్

జవాబు :   3

2. పేదవాడి పట్టు (కృత్రిమ పట్టు) అని దేన్నిఅంటారు? 
1) నైలాన్
2) టెరిలీన్ 
3) రేయాన్
4) పెర్లాన్
జవాబు :   3


3. ఆటవస్తువులు, గృహోపకరణాలు, ప్రయోగశాలపరికరాల తయారీలో వాడే ప్లాస్టిక్లు?
1) అల్ప సాంద్రత పాలిథీన్
2) టెఫ్లాన్
3) అధిక సాంద్రత పాలిథీన్
4) రేయాన్

జవాబు :   3

4. రేడియో, టెలివిజన్ కేబినెట్లను తయారు చేయడానికి ఉపయోగించే పాలిమర్? 

1) పాలిథీన్
2) పాలి స్టెరీన్
3) నైలాన్
4) రేయాన్

జవాబు :   2

5. నూలుకు ప్రత్యామ్నాయంగా టెన్నిస్ రాకెట్లు,సైకిల్ ఫ్రేములు, చేపలు పట్టడానికి ఉపయోగించే రాడ్లు లాంటి వాటి తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? 

1) పాలిథీన్
2) పీవీసీ
3) పాలి ఎకైలో నైటైల్
4) సహజ రబ్బరు

జవాబు :   3

6. ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ తయారీకి ఉపయోగించే సెల్యులాయిడ్లు ఏ ముడిపదార్థాల నుంచి తయారుచేస్తారు? 

1) కర్పూరం (కాంఫర్)
2) నత్రికామ్లం
3) సెల్యులోజ్
4) అన్నీ

జవాబు :   4

7. భూమి మీద అత్యధికంగా లభించే పాలీమర్ ఏది? 
1) పాలిథీన్ 
2) సెల్యులోజ్
3) నైలాన్
4) కెప్లెర్ 
జవాబు :   2

8. సహజ రబ్బరు గట్టిదనం పెంచడానికి చేసే వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే కారకం? 
1) గ్రాఫైట్
2) సల్పర్ 
3) ఫాస్పరస్
4) పొటాషియం 
జవాబు :   2

9. కిందివాటిలో కృత్రిమ రబ్బరు?
1) నియోక్రీన్ 
2) స్టెరీన్ బ్యూటాడైయీన్ రబ్బరు 
3) నైట్రైల్ రబ్బరు
4) అన్ని 
జవాబు :   4

10. కన్వేయర్ బెల్టులు, గాస్కెట్ల తయారీలో ఉపయోగించే  పాలిమర్? 
1) నియోక్రీన్
2) నైలాన్ 
3) బేకలైట్
4) టెఫ్లాన్ 
జవాబు :   1

11. వాహనాల టైర్లు, పాదరక్షల భాగాలు తయారుచేయడానికి వాడే పాలిమర్? 
1) నియోక్రీన్
2) బ్యునా-S 
3) స్టెరీన్ బ్యూటాడైయీన్ రబ్బరు
4) 2, 3 
జవాబు :   4

12. తొడుగులు (Gloves), ఆయిల్ సీల్లు,హౌస్ పైపులను తయారుచేసేందుకు ఉప యోగించే పాలిమర్? 
1) బ్యునా-S
2) బ్యునా-N 
3) నైట్రైల్ రబ్బరు 
4) 2, 3 
జవాబు :   4

13. నియోప్రేన్ అనే కృత్రిమ రబ్బరు యొక్క మోనోమర్ ఏది?
1) క్లోరోఫ్రీన్
2) స్టెరీన్ 
3) ఎకైలో నైటైల్
4) ఈథేన్ 
జవాబు :   1

14. రక్తం ప్లాస్మా రూపంలో ప్రాణ రక్షణ పదార్థంగా పనిచేసే పాలిమర్? 
1) బేకలైట్
2) బ్యునా-N 
3) పాలి వినైల్ పిరోలిడోన్ 
4) బ్యునా-S 
జవాబు :   3




15. గాజుకు ప్రత్యామ్నాయంగా వాడే ప్లాస్టిక్ ఏది? (ఇది గాజు ధర్మాలను పోలి ఉంటుంది)

1) నైలాన్ 
2) పాలి మిథైల్ మిథాక్రియేట్
3) టెరిలీన్ 
4) టెఫ్లాన్ 
జవాబు :   2

16. కృత్రిమ పోగులను (దారాలు) వేటి నుంచి తయారు చేస్తారు? 
1) నైలాన్ – 6
2) నైలాన్ – 6, 6 
3) టెరిలీన్ 
4) అన్నీ
జవాబు :   4

17. కిందివాటిలో పాలిఎమైడ్?
1) నైలాన్ – 6 
2) నైలాన్ – 6, 6 
3) టెరిలీన్
4) 1, 2 
జవాబు :   4

18. టెరిలీన్ అనేది ఒక? 
1) పాలిఅడ్
2) పాలిఎస్టర్ 
3) పాలిఈథర్
4) పాలిఆక్సైడ్ 
జవాబు :   2

19. నైలాన్ – 6, 6 తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు? 
1) ఎడిపిక్ ఆమ్లం 
2) హెక్టా మిథిలీన్ డైఅమైన్ 
3) ఇథిలీన్ గ్లైకాల్
4) 1, 2 
జవాబు :   4

20. పాలి ఇథిలీన్ టెరిస్తాలేట్ (PET) పాలిమర్ సాధారణ నామం?
1) టెరిలిన్ 
2) డెక్రాన్ 
3) 1, 2 
4) పెర్లాన్ 
జవాబు :   3

21. టెరిలీన్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
1) ఇథిలీన్ గ్లైకాల్ 
2) టెరిఫాలిక్ ఆమ్లం
3) 1, 2 
4) ఎడిపిక్ ఆమ్లం 
జవాబు :   3

22. టూత్ బ్రష్ వెంట్రుకల తయారీ (Britles)లో
1) నైలాన్ – 6 
2) నైలాన్ – 6, 6
3) పాలిథీన్ 
4) టెఫ్లాన్ 
జవాబు :   2

23. ప్రయోగశాలలో ఉపయోగించే సురక్షిత కళ్లజోళ్లు, సీడీ, డీవీడీ, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, రక్షణ హెల్మెట్ల తయారీలో వాడే ప్లాస్టిక్ ఏది? 
1) పాలికార్బోనేట్
2) నైలాన్ 
3) పాలిఅమైడ్
4) ఏదీకాదు 
జవాబు :   1

24, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్? 
1) నైలాన్
2) డెక్రాన్ 
3) కెప్లెర్
4) టెఫ్లాన్
జవాబు :   3

25. ఫీనాల్, ఫార్మాలి హైడ్ నుంచి తయారుచేసే పాలిమర్ ఏది? 
1) నైలాన్
2) బేకలైట్ 
3) గ్లిష్టాల్
4) పాలికార్బొనేట్ 
జవాబు :   2

26. లామినేషన్ చేయడంలో ఉపయోగించే పాలిమర్? 
1) బేకలైట్ 
2) టెరిలీన్
3) పాలికార్బోనేట్ 
4) పాలిథీన్ 
జవాబు :   1

27. పగలని పింగాణి వస్తువుల తయారీలో ఉపయోగించే పాలిమర్? 
1) యూరియా – ఫార్మాల్డి హైడ్ రెజిన్ 
2) మేలమైన్ – ఫార్మాల్డిహైడ్ రెజిన్ 
3) ఫీనాల్ – ఫార్మాల్డిహైడ్ రెజిన్
4) నైలాన్ – 6, 6 
జవాబు :   2

28. కూల్డ్రింక్ బాటిల్స్ తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్? 
1) పాలి ఇథిలీన్ టెరిఫ్తాలేట్ 
2) పీవీసీ 
3) బేకలైట్
4) పాలీకార్బొనేట్ 
జవాబు :   1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!