మన దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్ పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. మార్కెట్ లో సేల్ అయ్యే ప్రతీ వస్తువుకి తోడుగా మరికొన్ని వస్తువులు అవసరం అవుతుంటాయి. మొబైల్స్ కి స్క్రీన్ గార్డ్స్ మరియు బ్యాక్ కేసెస్, బైక్స్ కు సీట్ కవర్లు మరియు బ్యాగ్స్ ఇలా ప్రతి ప్రొడక్ట్ కి వేరే ఇంకో వస్తువు అవసరం పడుతూనే ఉంటుంది.
ఇలాంటి వస్తువులకు మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందువలన ఇలాంటి వస్తువుల తయారితో కూడా మనం చక్కటి లాభాలను పొందవచ్చు. ఇలాంటి ఒక బిజినెసే డిష్టిల్డ్ వాటర్ మేకింగ్ బిజినెస్. మామూలుగా డిష్టిల్డ్ వాటర్ ను బ్యాటరీలలో పోయాడానికి ఉపయోగిస్తుంటారు. సహజంగా ఇంట్లోని ఇన్వెర్టర్స్ లలో, కార్లు మరియు బైక్స్ లో వాడే బ్యాటరీలలో ప్రతి మూడు నెలలకి ఒకసారి వాటర్ ని మార్చవలసి ఉంటుంది. అందువలన వీటి అవసరాన్ని ఆదాయవనరుగా మలచుకుని మనం చక్కగా డబ్బును సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇక ఈ డిష్టిల్డ్ వాటర్ తయారీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.