మనం నిద్రపోతున్న సమయం లో కూడా మనం సంపాదించిన డబ్బులు పిల్లలు పెట్టేలా చేసుకోలేదంటే మనం జీవితం లో చివరి రోజువరకు చాకిరీ చేయాల్సి వస్తుంది.

తెలివిగా సంపదను పెంచటంలో ఆరితేరిన ఘనుడు, ఆధునిక ప్రపంచానికి పెట్టుబడులు గురువు 3 వారెన్ బఫెట్. వయసు రీత్యా 90లకు దగ్గరవుతున్నా ఇప్పటికీ ఆయన దినచర్యలో పెద్ద మార్పేం లేదు. గత 40 ఏళ్లుగా ప్రతి రోజూ దాదాపు ఒకేలా గడుపుతున్నారు. రాత్రి 10.45కల్లా పడుకుంటారు. “నాకు హాయిగా నిద్ర పడుతుంది. అందుకే ప్రతి రాత్రీ కనీసం 8 గంటలు నిద్రపోతా” అని చెబుతుంటారు. 

సంపన్నుల జాబితాలో పైఎత్తున ఉండటం ఒక్కటే అయితే ప్రపంచం బఫెట్లు పెద్దగా పట్టించుకునేదికాదేమోగానీ.. సేల్మన్గా జీవితం మొదలు పెట్టి అసమానంగా ఎదిగిన ఆయన ఆలోచనాపరుడిగా, దాతగా, దార్శనికుడిగా కూడా నిలబడటంతో ఆయన మాటలు అంతా రిక్కించి వింటారు. మరి ఇంత పెద్దాయన… రోజులో ఎక్కువ భాగం ఏం చేస్తారు? పగటిపూట 80% సమయం చదువులోనే గడుపుతారు. రోజుకు 500 పేజీలైనా చదవటం చాలా అవసరమని, అలా చదివితేనే విజ్ఞానమనేది చక్రవడ్డీలా పెరుగుతుందని చెబుతుంటారు. ఉదయం 6, 45కు లేస్తారు. ఇంటిదగ్గరే వాల్ స్ట్రీట్ జర్నల్, యూఎస్ఏ టుడే, ఫోర్స్ తర్వాత ఆఫీసులో ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, ఒమహా వరల్డ్ హెరాల్డ్, అమెరికన్ బ్యాంకర్.. ఇలా వార్తాపత్రికలను కనీసం ఐదారు గంటలు క్షుణ్ణంగా చదువుతారు. 

పగలంతా హెడ్లైన్స్ చూస్తుంటారు. కార్పొరేట్ నివేదికలను జల్లెడ పట్టేస్తుంటారు. 40 ఏళ్లుగా ఒకటే బ్రేక్ ఫాస్ట్ ఆఫీసుకు వెళ్లే దారిలో మెక్డొనాల్స్ దగ్గర ఆగి, సాసేజ్, గుడ్లు, చీజ్.. ఇలా మూడు రకాల్లో ఏదో ఒకటి తింటారు, వీటి మీద ఏనాడూ 8.17 డాలర్లకు మించి ఖర్చు పెట్టింది లేదు. ఫాస్ట్ఫుడ్, కోక్ అంటే మక్కువ కాబట్టి దానికి తగ్గట్టే వ్యాయామం ఎక్కువ చేస్తారు. దశాబ్దాల క్రితం కొనుక్కున్న చిన్నపాటి ఇంట్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాకు దూరం. బ్రిడ్జ్ ఆట అంటే ప్రాణం. ఎంతలా అంటే.. “నేనొకసారి బ్రిడ్జ్ ఆడటం మొదలెట్టానంటే నా పక్క నుంచి ఒక అమ్మాయి నగ్నంగా నడిచిపోతున్నా నాకు పట్టదు..” అంటారు సరదాగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!