పెరుగుతున్న అధునాతన టెక్నాలజీతో పాటుగా అదే రీతిన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ లలో అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జోమాటో, స్విగ్గి, బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థల ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. 

ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది “టౌన్ కార్ట్” ఫ్రాంచైజీ బిజినెస్. ప్రస్తుతం ఈ టౌన్ కార్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లోనే కిరాణా వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. చిన్న పట్టణాల్లో ఇటీవల వేగంగా పెరుగుతున్న సంస్థ ఇది. కాబట్టి ఈ టౌన్ కార్ట్ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!