మీరు పార్ట్ టైమ్ జాబ్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? లేదా ఫుల్ టైమ్ మంచి వృత్తిలో స్థిరపడదామనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. టెన్త్ పాసైతే చాలు ఎల్ఐసీ ఏజెంట్‌గా మారొచ్చు.
మీకు కొత్త వ్యక్తుల్ని కలవడం, ఎక్కువగా తిరగడం ఇష్టమైతే, సొంతతెలివితేటలతో వ్యాపారంలో ఎదిగే ఆలోచనలు ఉంటే ఎల్ఐసీ ఏజెంట్గా కెరీర్ మొదలుపెట్టొచ్చు. రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలన్నది మీ ఇష్టం. ఎన్నిగంటలైనా కష్టపడొచ్చు. ఎంత కష్టపడితే అంత లాభం. సంస్థ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ప్రపంచ స్థాయి శిక్షణ కూడా లభిస్తుంది. మీ పనితనానికి తగ్గ గుర్తింపు, లాభాలు ఉంటాయి. మీరు ఫుల్ టైమ్ కాకపోయినా పార్ట్ టైమ్ ఏజెంట్‌గా కూడా సేవలు అందించొచ్చు.

మరి ఎల్ఐసీ ఏజెంట్ కావాలంటే ఏం చదవాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎల్ఐసీ ఏజెంట్‌గా మారితే వచ్చే లాభాలేంటీ? ఈ వివరాలన్నీ ఈ వీడియో లో తెలుసుకుందాం