చాల మంది ఈ టపాసుల వ్యాపారం కేవలం సంవత్సరానికి ఒక నెల మాత్రమే జరిగే బిజినెస్ అనుకుంటూ ఉంటారు కానీ ఈ బిజినెస్ అనేది సంవత్సరం మొత్తం జరుగుతుంది ఎలా అంటే పెళ్లిళ్లకు, వినాయక చవితి ఉరేగింపులకు, దేవి నవరాత్రులు ఇలాంటి ఫంక్షన్ లలో హడావిడి కనిపించాలంటే టపాసులు ఉండాల్సిందే ఎంత ఎక్కువగా టపాసులు పేలిస్తే అంతగొప్ప గా చెప్పుకుంటారు
మీరు హోల్ సేల్ గా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు నూటికి 50 రూపాయలు ఆదాయం ఉంటుంది.అదే రిటైల్ గా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు మీరు వ్యాపారం చేస్తే మీకు కనీసం నూటికి రెండు వందల రూపాయలవరకు ఆదాయం ఉంటుంది ఈ దీపావళి టపాసులు మరియు క్రాకర్స్ వ్యాపారం ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ల వద్ద నుండి మాత్రమే మనం వీటిని కొనుగోలు చేయాలి.