ఏ వంటకంలోనైనా కొద్దిపాటి కొత్తిమీర వేస్తే దాని రుచే మారిపోతుంది. అటువంటి కొత్తిమీరని వివిధ రకాలైన వంటకాల్లో వాడటమే కాకుండా పచ్చళ్లు, సలాడ్లు వంటి వాటిలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా ఈ కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న కొత్తిమీరకి సీజన్ తో సంబంధం లేకుండా ఎంతో డిమాండ్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్న కొత్తిమీరను సాగు చేసి మనం అధిక లాభాలను పొందవచ్చు. సాగు అనగానే ఎక్కువ రిస్కు ఉంటుందని అనుకోకండి. కొత్తిమీర సాగు చేయడం చాలా సులభం మరియు తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు.