సహజంగా మన దేశంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పదార్ధాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎంతో పురాతన కాలం నుంచి భారతీయు వంటిళ్లలో కారం అనేది ఒక ముఖ్యమైన పదార్థంగా మారింది. కారం లేనిదే మనకు ఏ కూరా పూర్తి కాదు.కాబట్టి ఈ రోజు మనం “చిల్లి పౌడర్ మేకింగ్ బిజినెస్” అంటే కారం పొడి తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
సహజంగా చిల్లి పౌడర్ ధర మార్కెట్ లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కల్తీ కూడా ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల మనం చక్కటి క్వాలిటీతో చిల్లి పౌడర్ ను తయారు చేసి మార్కెటింగ్ చేస్తే చక్కటి ఆదాయాన్ని సంపాదించవచ్చు