ఎన్నికల పండగ వచ్చేసింది. దండీగా డబ్బులు దొరికే కాలమని అందరు తెగ సంబరపడిపోయో ఓట్ల పండుగ సందర్బంగా ఓటు అనేది ఎందుకు ఆవశ్యకరమో తెలుసుకుందాం.

భారతదేశంలో ఓటు అనే సంస్కృతీ మొదలైంది అక్టోబర్ 25 1951 నుండి 21 ఫిబ్రవరి 1952 వరకు స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సరి అధికారపగ్గాలను ప్రజా సమక్షంలో ప్రజలే నిర్ణేతలుగా తీసుకోవాలని చెప్పిన అంబెడ్కర్ వాదనను దేశ నాయకులూ అందరు సమ్మతిస్తూ తమ బలాబలాలను ఇంకా ప్రజల అభిమానాన్ని కొలిచే వేదికగా భారతీయ సాధారణ ఎన్నికలు సరిగ్గా సరిపోతాయి అని భావించి ఎన్నికల బరిలోకి దిగారు. అలా మొదట నిర్వహించిన ఎన్నికలల్లో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఫుల్ పూర్ లోక్ సభ స్తానం నుండి 4,76,65,875 పాపులర్ వోట్ మాజికల్ ఫిగర్ తో సుమారు 45% స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించారు. ఆయన అధ్యక్షత వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 489 సీట్లకు గాను 364 సీట్లను గెలుచుకొని ప్రజాభిప్రాయాన్ని , వారి అభిమానాన్ని బాహాటంగా తెలియచేసిన వేదికగా ఈ ఎన్నికలను మనం చూసి గర్వపడవచ్చు అని ప్రపంచం మొత్తం తెలిసేలా ఓటు హక్కు ద్వారా సమాజం ఎంతగా ప్రభావితం అవుతుంది అనేది తెలియచేయగలిగారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తోపాటు పోటీ చేసిన ఇతరపార్టీలు తమ వంతు ఓట్లను ఎలా నమోదు చేసుకున్నాయి ఇప్పుడు చూద్దాం, భారతీయ జన సంఘ్ పార్టీ 32,46,288ఓట్లను, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 34,84,401 ఓట్లను, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 61,56,558 ఓట్లను , సోషలిస్ట్ పార్టీ 1,12,66,779 ఓట్లను, ఇండిపెండెంట్ అభ్యర్థులు 1,68,17,910 ఓట్లను, గెలుచుకున్నారు, ఈ మొదటి ఎన్నికలలలో మొత్తం పోల్ అయిన ఓట్ల సంఖ్య 105,944,495 . ఇలా జరిగిన మొదటి సారి 10 కోట్ల ఓట్లు నమోదు చేసి చరిత్ర సృష్టించింది భారత దేశం, ప్రజా నిర్ణయం ఇలా తెలియచేయడం వలన భవిష్యత్తులో తీసుకోవలసిన ఎన్నో నిర్ణయాల ప్రణాళికలు, వాటితాలూకు లెక్కలు వేయడం లో కూడా ఈ ఓటు నమోదు అనేది చాలా తోడ్పడింది అని చెప్పుకోవచ్చు.


ఇక ఈ ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని భారత ప్రభుత్వం తరపున రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 324 మరియు రెప్రజెంటేషన్ అఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా 25 జనవరి 1950 నుండి కొనసాగిస్తోంది. అప్పటి కాలంలో ఉద్దండ పిండంగా పేరు తెచ్చుకున్న సుకుమార్ సేన్ 21 మార్చి 1950 నుండి 19 డిసెంబర్ 1958 వరకు మొదటి ఎలక్షన్ కమిషనర్ అఫ్ ఇండియా గా తన భాద్యతలను చాల చురుకుగా నిర్వహించి తన పదవి కాలంలో రెండు సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వించిన మొదటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయన చెప్పిన కొన్ని అంశాల ప్రకారం గణతంత్ర దేశంగా , వరల్డ్  బిగ్గెస్ట్ డెమోక్రసీ గా పేరు తెచ్చుకున్న ఈ భారత దేశంలో ప్రజా తీర్పుగా చెప్పుకునే ఓటు చాల ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అని , రానున్న రోజుల్లో ఓటు అనే సిద్ధాంతం వలన భారత దేశం ఎదుగుదల ఇంకా ఉన్నత స్థాయిలో నిలుపుతుంది అని అయన పలు అంతర్జాతీయ వేదికల పైన చెప్పుకొచ్చారు. ఈయనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే సుడాన్ దేశం కూడా తమ దేశం మొదటి ఎలక్షన్ కమిషనర్ గా ఈయనను ఎన్నుకున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి భారత దేశంలో ఓటు నమోదు అనేది చాల కీలకంగా మారింది. వ్యక్తిగత కారణాలు, ఇంకా భావోద్వేగాలను ప్రక్కన పెట్టి వ్యవస్థను బాగుచేసే ఓటు హక్కును వినియోగించుకొని సరియైన అభ్యర్థికి ఓటు వేయాలి అనేది మన 67 ఏళ్ల ఓటింగ్ చరిత్ర మనకు చెప్పే పచ్చి నిజం.

2019 సంవత్సరం వచ్చినాకూడా సగటు భారతీయ ఓటరు ఇంకా కులాలు, మతాలూ, వర్గాలు పేరుతొ జనాలను విచ్చిన్నం చేసి ఓట్లను చీల్చే అవకాశవాద రాజకీయ నాయకులు, ఎన్నికల లో మా వర్గంవారు ఎన్ని సీట్లు నెగ్గారు అని జబ్బలు చరుచుకొనే వారు ఒక వైపు, ఒక వ్యక్తి అసలు ఆ పదవికి అర్హుడా కాదా అన్న విషయం ప్రక్కన పెట్టి అతను  మా కులం వాడా, మా మతం వాడా, మా వర్గం వాడా అని ఆలోచించి ఓట్లు వేసే దిగజారుడు తనాన్ని సంఘపరంగా వ్యక్తం చేసే వేదికలుగా నేటి ఓట్లు తయారుఅవుతున్నాయి, ఇక  మద్యం,డబ్బు విషయాలు సరేసరి, ఏరులై పారే మద్యం  సాక్షిగా,ఓటుకు నోటు తీసుకుని , మద్యం మత్తులో దేవులాడుకుంటూ, తూలుతూ, తమ నాయకుడు జిందాబాద్ అని గొంతు బొంగురుపోయేలా అరుచుకుంటూ ఓటు మీట నొక్కేసి వస్తున్నారు చాలామంది.

ఓటు అనేది మనదేశం, మన రాజ్యాంగం మనకు ఇచ్చిన అమూల్యమైన బ్రహ్మాస్త్రం, ఒక్క ఓటు చాలు అభ్యర్థుల తలరాతలు మార్చడానికి, ఒక్క ఓటు చాలు దుమ్ముకొట్టుకొని పోయిన నీ వీధిలోని రోడ్లు కళకళలాడటానికి, ఒక్క ఓటు చాలు నీ భార్య, నీ తల్లి, నీ బిడ్డ , ధైర్యంగా భయం లేకుండా తమ పని తాము చేసుకోవడానికి, నీ ఓటుతో మొదలవుతుంది నీ బిడ్డల భవిష్యత్తుకు మొదటి మెట్టు, నీ ఓటుకు దమ్ము ఉంది, వెళ్లి ఓటు వేసి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడు. నీవు ఓటు వేయకుంటే నీవు చనిపోయినట్లే లెక్క . యువర్ ఓట్ … యువర్ వాయిస్ … జైహింద్ ….. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!