1. ఓటర్లందరూ స్త్రీ పురుషులు వేర్వేరుగా క్యూలైన్ పాటించి పోలీసు శాఖ వారికి సహకరించ వలెను

2.పోలింగ్ స్టేషన్ కు వచ్చు ఓటర్లు ఎవరు సెల్ ఫోన్ లు తీసుకు రాకూడదు.

3. మద్యం సేవించి ఓటు వేయడానికి రాకూడదు .

4.పోలింగ్ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు  తీసుకొని రారాదు ,అలాగే వాటర్ బాటిల్స్ కానీ ఇంకు బాటిల్స్ కానీ తీసుకొని రాకూడదు.

5. రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు ,టోపీలు, కండువాలు ,జెండాలు మొదలగు వాటితో పోలింగ్ కేంద్రానికి రాకూడదు .

6.ఓటర్ కార్డు పై మీ వివరాలు అన్నియు సరిగా ఉన్నచో ఓటర్ ఐడీ కార్డు తో ఓటు వేసుకోవచ్చు.

7. ఓటరు స్లిప్ తో ఓటు వేయడానికి వెళ్ళిన యెడల ఈ క్రింది వాటిలో ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని రావలెను

ఐడి ప్రూఫ్ వివరాలు : 
1. పాస్ పోర్టు 
2.డ్రైవింగ్ లైసెన్స్ 
3. సర్వీస్ ఐడీ కార్డు (గవర్నమెంట్ వారిచే జారీ చేయబడింది) 
4. పాస్ ఫోటో తో కూడిన పాసుబుక్ (బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేయబడింది ) 
5.పాన్ కార్డు
6.ఆధార్ కార్డు 
7.  స్మార్ట్ కార్డు ఆర్ జె 
8. ఎమ్. జి.ఎన్.ఆర్ యి ..జి. యస్ జాబ్ కార్డు  
9.హెల్త్ కార్డు (ఎమ్.ఓ/ లేబర్ వారిచే జారీ చేయబడింది) 
10. పెన్షన్ డాక్యుమెంట్ ఫోటో తో కలిపి ఉన్నది


8.పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్లు లైను లోపల మాత్రమే ఓటర్లకు ప్రవేశం కలదు

9 ఓటు వేసిన వెంటనే తిరిగి పోలింగ్ కేంద్రం నుండి విడిచి వెళ్లిపో వలెను.

10. పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్లు అవతల ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను పార్క్ చేయవలెను         
              
11.పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్లు అవతల  మాత్రమే రాజకీయ పార్టీ వారు నీడనిచ్చే లాంటివి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న టేబుల్ ,రెండు కుర్చీలు ఏర్పాటు చేసుకుని ఇద్దరు మాత్రమే ఉండవలెను అలాగే పార్టీ జెండాలు కానీ గుర్తులు కానీ బ్యానర్లు గాని ప్రదర్శించరాదు

12.ఏ పార్టీ వారు కూడా ఎటువంటి టెంట్లను ఏర్పాటు చేయ రాదు. టిఫిన్లు భోజనాలు మొదలగునవి ఓటర్లకు సరఫరా చేయరాదు.

13. ఓటర్ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తు రంగులు అభ్యర్థి పేర్లు మొదలగునవి కలిగిన వాటిపైన ఇవ్వరాదు                         

14.పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ చేయబడుతున్నందున ఎవరు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన చట్టప్రకారం చర్యలు తీసుకొనబడును.

15. ఓటర్లకు మద్యం గాని  డబ్బులు గానీ, వస్తు రూపంలో కాని పంచిన యెడల పంచిన వారు మరియు తీసుకున్న వారు ఇరువురు పైన చట్టప్రకారం చర్యలు తీసుకొనబడును.

16. ఓటరు ఓటు వేసినపుడు ఎవరు ఎటువంటి ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరం                             

17.రాజకీయ పార్టీల వారు ఓటర్లను ఏ విధమైన వాహనాల్లోనూ పోలింగ్ కేంద్రానికి తరలించారు.

18. 144 సి.ఆర్.పి.సి సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి ఉండరాదు.

  • ఓటును అమ్ముకోవద్దు….. మీ పసుపులేటి మల్లికార్జున (Admin)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!