దోమ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు…ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుయ్ మంటూ చెవుల దగ్గరే తిరుగుతుంది. తలుపులన్నీ బిగించినా వీటిని మాత్రం ఆపలేం. జెట్స్, కాయిల్స్, ఆల్ అవుట్స్ ఇలా ఎన్ని వాడినా వాటి నుండి వచ్చే పొగ వాళ్ళ మన ఆరోగ్యం పాడవుతుంది కానీ దోమలు మాత్రం పూర్తిగా పోవు.
ఈ మధ్య మార్కెట్ దోమల అగరబత్తీలు బాగా పాపులర్ అయ్యాయి. వీటిలోనూ ఆరోగ్యానికి హాని చేయని హెర్బల్ అగరబత్తీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వీటినే తయారు చేసి అమ్మే బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయడం వల్ల మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. .