రానున్న 2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ శుక్రవారం 12/07/2019 న శాసనసభలో ప్రవేశ పెట్టారు. 28,866.23 కోట్ల ఈ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం క్రింద 27,946.65 కోట్లు ఉండగా పెట్టుబడి వ్యయం క్రింద 919.58 కోట్లు, రైతు పెట్టుబడి సాయం క్రింద 8750 కోట్లను కేటాయించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 సాయం చేయనున్నారు
➥ రూ.28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
➥ రైతుల పెట్టబడి సాయం -రూ.8,750 కోట్లు అక్టోబర్ నుంచి పెట్టుబడి సాయం అందజేత
➥ 81 వేల హెక్టార్లలో ఉద్యాన వన పంటల సాగు లక్ష్యం
➥ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటుకు ప్రణాళిక
➥ పులివెందులలో అరటి పరిశోధన కేంద్ర0, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
➥ ఈ ఏడాది 12 ఈనాం మార్కెట్ల ఏర్పాటు
➥ నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ.10వేలకు పెంపు
➥ ఆ వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ. 10 లక్షలు
➥ 10 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గిడ్డంగుల నిర్మాణం
➥ 100 రైతు బజారులు ఏర్పాటు
➥ 50 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు
➩ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి-రూ.1163 కోట్లు
➩ వైఎస్సార్ రైతు బీమాకు-రూ.100 కోట్లు
➩ ప్రమాదవశాత్తు రైతు చనిపోతే-రూ.7 లక్షలు
➩ ధరల స్థిరీకరణ నిధికి-రూ.3వేల కోట్లు
➩ విపత్తు నిర్వహణ నిధి-రూ.2002 కోట్లు
➩ జాతీయ ఆహార భద్రత మిషన్-రూ.141 కోట్లు
➩ వ్యవసాయ యాంత్రీకరణకు-రూ.420 కోట్లు
➩ భూసార పరీక్ష నిర్వహణకు-రూ.30 కోట్లు
➩ ఆ పొలం పిలుస్తుంది, పొలం బడికి-రూ.89 కోట్లు
➩ వ్యవసాయ మౌలిక వసతలకు-రూ.349 కోట్లు
➩ రైతులకు రాయితీ విత్తనాలకు-రూ.200 కోట్లు
➩ జీరో బడ్జెట్ వ్యవసాయానికి-రూ.91 కోట్లు
➩ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి -రూ.29 కోట్లు
➩ పట్టు పరిశ్రమ అభివృద్ధికి -రూ.158 కోట్లు
➩ ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి-రూ.200 కోట్లు
➩ బిందు, తుంపర సేద్య పరికరాలకు-రూ.1105 కోట్లు
➩ పశుసంవర్ధక శాఖకు-రూ.1778 కోట్లు
➩ పశు టీకాల కోసం-రూ.25 కోట్లు
➩ పశువు మరణిస్తే బీమా పథకం కింది-రూ.30వేలు
➩ గొర్రె మరణిస్తే గొర్రెల బీమా పథకం కింద-రూ.6వేలు
➩ కోళ్ల పరిశ్రమల నిర్వాహకుల రుణాల కోసం-రూ.50 కోట్లు
➩ పాడిపరిశ్రమకు-రూ.100 కోట్లు ఆ పశుగ్రాసం కోసం-రూ.100 కోట్లు
➩ మత్స్యశాఖ అభివృద్ధికి రూ.550 కోట్లు
➩ జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో.. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం-రూ.1758 కోట్లు
➩ వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు- రూ.3223 కోట్లు
➩ వ్యవసాయ సహకార రంగానికి-రూ.234 కోట్లు
➩ రైతులకు ఉచిత విద్యుత్ కోసం-రూ.4525 కోట్లు