IMPORTANT HISTORY QUESTIONS in TELUGU

IMPORTANT HISTORY QUESTIONS:
1. ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళ ఎవరు? - రజియా సుల్తానా(ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె)

2. గుర్రాలకు గుర్తు వేయడమనే ‘దాగ్‌’ పద్ధతిని ప్రవేశ పెట్టింది ఎవరు? - అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

3. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌కు ఉన్న ఇతర పేర్లు ఏమిటి? - జునాఖాన్‌, ఉలుగ్‌ఖాన్‌

4. 1506లో రాజధానిని ఢిల్లీనుంచి ఆగ్రాకు మార్చిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు? - సికందర్‌ లోడి

5. మొదటి పానిపట్టు యుద్ధం(1526)లో ఇబ్రహీమ్‌ లోడి ఎవరి చేతిలో ఓడిపోయాడు? - బాబర్‌

6. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ఆస్థానంలో ఎనిమిది ఏళ్లు గడిపిన మొరాకో యాత్రికుడు ఎవరు? - ఇబన్‌ బటూటా

7. కుతుబ్‌ మినార్‌ను ఎవరు నిర్మించారు? - కుతుబుద్దీన్‌ ఐబక్‌ పునాది వేయగా ఇల్‌టుట్‌మిష్‌ పూర్తి చేశాడు.

8. రాజ తరంగిణి, మహాభారతాన్ని పర్షియా భాషలోకి అనువదించింది ఎవరు? - జైన్‌ ఉల్‌ అబిదిన్‌(కశ్మీరీ రాజు)

9. రాజధానిని లాహోర్‌ నుంచి ఢిల్లీకి మార్చిన సుల్తాన్‌ఎవరు? - అల్తమష్‌

10. దక్కన్‌పై మొదట దండయాత్ర చేసిన సుల్తాన్‌ ఎవరు? - జలాలుద్దీన్‌ ఖిల్జీ

11. నిరుద్యోగుల కోసం సంస్థను ప్రారంభించింది ఎవరు? - ఫిరోజ్‌షా తుగ్లక్‌

12. సుల్తాన్‌ల కాలంలో సుంకం వసూళ్లు చేసిందెవరు? - ముఖద్దములు, చౌదరీలు

13. న్యాయగంట ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాను ఎవరు? - బాల్బన్‌

14. ఇనాము భూమి అంటే ఏమిటి? - మత సంస్థలకు మత పీఠాధిపతులకు పారితోషికంగా ఇచ్చే కమతాలు

15. ఎవరి ప్రోత్సాహంతో హరిహర రాయలు, బుక్కరాయలు స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు? - విద్యారణ్య స్వామి

16. సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు? - రెండో దేవరాయలు

17. విజయనగర రాజుల్లో గొప్పవాడు ఎవరు? - శ్రీ కృష్ణ దేవరాయలు

18. విజయనగర రాజులు ఏ యుద్ధంలో ముస్లింల చేతిలో ఓడిపోయారు? - తళ్లికోటయుద్ధం/రక్కసి తంగడి
యుద్ధం(1565)

19. కృష్ణదేవరాయల పాలనా కాలం ఏది? - క్రీ.శ. 1509-1529

20. విజయనగర రాజ్యాన్ని ఏ రష్యా యాత్రీకుడు సందర్శించాడు? - నికిటన్‌

21. విజయనగర సామ్రాజ్యంలో దేవదాసీలకు సమాజంలో ప్రముఖ స్థానం ఉండేదని పేర్కొన్న విదేశీ యాత్రికుడు
ఎవరు? - డోమింగో పేస్‌

22. అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? - కృష్ణదేవరాయలు

23. విజయనగర యుగంలో చలామణిలో ఉన్ననాణెం ఏది? - వరాహ

24. విజయనగర చిత్రలేఖనం ఎక్కడ కనిపిస్తుంది? - లేపాక్షి

25. సూఫీల్లో ప్రధాన శాఖ ఏది? - చిస్తీ శాఖ

26. గురుముఖి లిపిని ప్రవేశ పెట్టింది ఎవరు? - గురునానక్‌

27. కృష్ణదేవరాయలు నాగలాపురం పట్టణాన్ని ఎందుకు నిర్మించాడు? - తల్లి నాగమాంబ స్మారక చిహ్నంగా

28. ఆముక్తమాల్యద తెలుగు కావ్యాన్ని, జాంబవతి పరిణయం సంస్కృతకావ్యాన్ని ఎవరు రచించారు? -
కృష్ణదేవరాయలు

29. ఆంధ్ర కవితాపితామహుడు అని ఎవరిని అంటారు? - అల్లసాని పెద్దన

30. ఆంధ్రభోజుడు ఎవరు? - కృష్ణదేవరాయలు

31. బీజాపూర్‌లో గోల్‌గుంబజ్‌ నిర్మించిన బహమనీ సుల్తాన్‌ ఎవరు? - మహ్మద్‌ ఆదిల్‌షా

32. గోల్కొండ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? - కులీ కుతుబ్‌షా(1518)

33. కొత్వాల్‌ అంటే ఏమిటి? - పోలీస్‌ శాఖాధిపతి

34. హిందీలో రామచరిత మానస్‌ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? - తులసీదాస్‌

35. బాబర్‌ సమాధి ఎక్కడ ఉంది? - కాబుల్‌

36. మొఘలుల కాలంలో సింహాసనం అధిష్టించిన హిందువు ఎవరు? - హేము(విక్రమ్‌జిత్‌)

37. క్రీ.శ. 1556లో రెండో పానిపట్టు యుద్ధంలో అక్బర్‌ ఎవరిని ఓడించాడు? - హేము

38. మున్సబ్‌దారి పద్ధతిని ప్రవేశ పెట్టింది ఎవరు? - అక్బర్‌

39. అక్బర్‌ రాజగురువు ఎవరు? అతని సమాధి ఎక్కడ ఉంది? - సలీం చిస్తీ, ఫతేపూర్‌ సిక్రీ

40. న్యాయ గంటను ఏర్పాటు చేసిన మొఘలు చక్రవర్తి ఎవరు? - జహంగీరు

41. ఇంగ్లాండ్‌ రాజైన మొదటి జేమ్సు, జహంగీర్‌ ఆస్థానానికి పంపిన ఇంగ్లాండ్‌ రాయబారి ఎవరు? - సర్‌ థామస్‌ రో

42. మొఘలు రాజుల్లో ప్రముఖ చిత్రకారుడు ఎవరు? - జహంగీర్‌

43. ఎర్రకోట, మోతీమసీదు, జామా మసీదు, రంగమహల్‌, దివానీ ఖాన్‌, దివానీ ఆమ్‌ను నిర్మించింది ఎవరు? -
షాజహాన్‌

44. తాజ్‌మహల్‌ను నిర్మించిన వాస్తు కారుడు ఎవరు? - ఉస్తాద్‌ ఈశా

45. 187 అడుగుల ఎత్తున్న తాజ్‌మహల్‌ను నిర్మించడానికి ఎంత కాలం పట్టింది? - 12 ఏళ్లు

46. ఎవరి కాలంలో మొఘలుల వాస్తు పరాకాష్టకు చేరింది? - షాజహాన్‌

47. షాజహాన్‌ను ఔరంగజేబు ఎచ్చట బందీగా ఉంచాడు? - ఆగ్రా కోట

48. గురు అర్జునుని చంపించిన మొఘలు చక్రవర్తి ఎవరు? - జహంగీర్‌

49. అక్బర్‌ ప్రతిపాదించిన మతం ఏది? - దిన్‌ హి ఇలాహి

50. ఔరంగజేబు సలహాదారుడిగా ఉన్న ఫ్రెంచి వైద్యుడు ఎవరు? - బెర్నియర్‌

51. ఔరంగజేబు ఏ సిక్కుగురువుని ఉరి తీయించాడు? - గురు తేజ్‌బహదూర్‌

52. రాయగఢ్‌లో శివాజి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? - క్రీ.శ 1674

53. అక్బర్‌ నిషేధించిన జిజియా పన్నును ఔరంగజేబు ఎప్పుడు ప్రవేశ పెట్టాడు? - క్రీ.శ. 1679

54. ఆగ్రాలోని మోతీ మసీదు, ఢిల్లీలోని జామా మసీదులను ఎవరు నిర్మించారు? - షాజహాన్‌

55. శివాజి పరిపాలన వ్యవస్థలో మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? - అష్టప్రధాన్‌

56. శివాజి ఏ మొఘల్‌ సేనానిని ఓడించాడు? - షాయిస్థ ఖాన్‌

57. మొఘలులపై శివాజి ఏ రకమైన యుద్ధం చేశాడు? - గెరిల్లా యుద్ధం

58. హైదరాబాద్‌ స్థాపకుడు ఎవరు? - నిజాం ఉల్‌ ముల్క్‌(అసఫ్‌జా)

59. ఉర్దూ భాషను దక్కన్‌లో ప్రవేశ పెట్టింది ఎవరు? - బహమనీ సుల్తానులు

60. క్రీ.శ. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘనిస్థాన్‌ పాలకుడైన అహమద్‌ షా అబ్దాలీ చేతి లో ఎవరు
ఓడిపోయారు? - మరాఠా కూటమి, మొఘలులు

61. హిందూ-పద్‌ షాహిని ప్రచారం చేసింది ఎవరు? - మరాఠా పీష్వాలు

62. ‘ఆది గ్రంథ్‌’ను క్రోడీకరించింది ఎవరు? - గురు అర్జున్‌దేవ్‌

63. సిక్కుల ఆఖరి గురువు ఎవరు? - గురు గోవింద్‌ సింగ్‌

64. 1699లో సిక్కుల ఖల్సాను స్థాపించింది ఎవరు? - గురు గోవింద్‌ సింగ్‌

65. కేశ్‌(పొడవైన వెంట్రుకలు), క్రిపాణ్‌(చిన్న ఇనుప కత్తి), కడ(ఇనుప కడియం), చిన్నలంగోటి, కంగణ్‌ ఎల్లప్పుడు
ధరించేవిధంగా చేసిన సిక్కు గురువు? - గురుగోవింద్‌ సింగ్‌

66. ఔరంజేబు దేనిలో విద్వాంసుడు? - వీణ

67. చివరి మొగల్‌ చక్రవర్తి అయిన రెండో బహదూర్‌షా 1862లో ఎక్కడ వురణించాడు? - రంగూన్‌

68. అరబిక్‌, పర్షియన్‌, సంస్కృత భాషల్లో పండితుడైన దారాషుకో ఎవరి కువూరుడు? - షాజహాన్‌

69. కొన్ని ఉపనిషత్తులను, భగవద్గీతను పర్షియన్‌లోకి ఎవరు అనువదించారు? - దారాషుకో

70. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్‌, ఇటాలియన్‌ యాత్రికుడు వూనుచ్చి ఎవరి కాలంలో భారత దేశాన్ని
సందర్శించారు? - షాజహాన్‌

71. నూర్జహాన్‌ కట్టిచ్చిన సమాధి ఎవరిది? - ఇతువుదుద్దౌలా(నూర్జహాన్‌ తండ్రి)

72. యమునా నది ఒడ్డున పురానాఖిల్లా అనే కొత్త నగరాన్ని ఎవరు కట్టించారు? - షేర్‌షా

73. ఉలేమాలు అంటే ఎవరు? - ముస్లిం మత పండితులు

74. కాశ్మీర్‌ అక్బర్‌గా పేరుగాంచినవాడు(అక్బర్‌ కంటే ము0దు ఈయన జిజియా పన్నును రద్దుచేశాడు) - జైన్‌-ఉల్‌-
అబిదిన్‌

75. యూరోపియన్లు మధ్యయుగంలో ఆసియాపై ఎందుకు ఆధారపడ్డారు? - సుగంధ ద్రవ్యాలు

76. కాన్‌స్టాంట్‌నోపిల్‌ను తురుష్కులు ఎప్పుడు ఆక్ర మించారు? - క్రీ.శ. 1453

77. పర్షియా సింధూశాఖ వూర్గాన్ని (యూరప్‌ను ఆసియా ఖండంతో కలిపేది) ఎవరు కనుగొన్నారు? -
వాస్కోడిగామ(పోర్చుగీసు)

78. క్రీ.శ. 1498లో వాస్కోడిగామ దక్షిణాఫ్రికాలోని కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ ద్వారా భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని
చేరాడు? - కాలికట్‌

79. భారతదేశంలో పోర్చుగీసు వ్యాపార స్థావరాలు? - గోవా, డయ్యూ, డావున్‌

80. క్రీ.శ. 1600లో ఇంగ్లీషు ఈస్డ్‌ఇండియా కంపెనీ భారత్‌లో ఎక్కడ స్థాపించారు? - సూరత్‌

81. సూరత్‌లో కంపెనీ స్థాపనకు కెప్టెన్‌ హాకిన్స్‌కు అనువుతి ఇచ్చిన మొగల్‌ చక్రవర్తి ఎవరు? - జహంగీర్‌

82. పోర్చుగీసువారు క్రీ.శ. 1662లో బొంబాయి ద్వీపాన్ని వరకట్నం కింద ఏ దేశానికి ఇచ్చారు? - ఇంగ్లాండ్‌

83. మచిలీపట్నంకు వచ్చిన ఆంగ్లేయుల ఓడ పేరు? - గ్లోబ్‌

84. బ్రిటిష్‌ వారికి వ్యాపారం చేయడానికి అనువుతి ఇచ్చిన గోల్కొండ సుల్తాన్‌? - సుల్తాన్‌ మహమద్‌ కులీ కుతుబ్‌షా

85. బెంగాల్‌పై బ్రిటిష్‌ రాజ్యాధిపత్యాన్ని స్థాపించడానికి సహకరించిన యుద్ధం? - ప్లాసీ యుద్ధం(1757)

86. బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందెవరు? - రాబర్ట్‌ క్లైవ్‌

87. రైత్వారీ విధానాన్ని థామస్‌ మన్రో ఎక్కడ ప్రవేశపెట్టారు? - మద్రాసు ప్రావిన్స్‌

88. స్వతంత్ర సిక్కు రాషా్ట్రన్ని స్థాపించింది? - రంజిత్‌సింగ్‌

89. శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టింది? - కారన్‌ వాలీస్‌

90. సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? - వెల్లస్లీ

91. రాజ్యా సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? - డల్హౌసి

92. సివిల్‌ సర్వీసును భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? - కారన్‌ వాలీస్‌

93. స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టింది? - రిప్పన్‌

94. మద్రాసు, కలకత్తా, బొంబాయిలలో ఉన్నత న్యాయస్థానాలను ఎవరు ప్రవేశపెట్టారు? - లారెన్స్‌

95. వాయువ్య ప్రాంతంలో మహల్‌వారీ భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది? - హేస్టింగ్స్‌

96. 19వ శతాబ్దంలో మనదేశంలో కుటీర పరిశ్రవులు దెబ్బతినడానికి కారణం? - బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక
విప్లవం

97. 1857లో బారక్‌పూర్‌ నుంచి సిపాయిల తిరుగుబాటుకు కారకుడెవరు? - మంగల్‌పాండే

98. ఢిల్లీని ఆక్రమించిన తరవాత సిపాయిలు ఎవరిని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు? - రెండో బహదూర్‌షా

99. 1857 తిరుగుబాటు జరిగిన ప్రాంతం, వారి నాయకులు? -1) వల్వి అహవుదుల్లా-ఫైజాబాద్‌ 2) ఢిల్లీ-భక్తఖాన్‌, 3)
ఝాన్సీ-లక్ష్మీబాయి 4) లక్నో-బేగవ్‌ు హజరత్‌ వుహల్‌ 5) కాన్పూర్‌-నానా సాహెబ్‌

100. నానాసాహెబ్‌ ఎవరు? - చివరి పీష్వా రెండో భాజీరావు దత్తపుత్రుడు

101. వహాబీ ఉద్యవూన్ని ప్రారంభించిందెవరు? - సయ్యద్‌ అహ్మద్‌

102. ముండా తిరుగుబాటు నాయకుడు? - బిర్పాముండా

103. అందరికంటే ముందు సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నదెవరు? - హైదరాబాద్‌ నిజాం

104. పంజాబ్‌ను పాలించిన రంజిత్‌సింగ్‌ రాజధాని? - లాహోర్‌

105. సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి పితావుహుడు? - రాజా రామ్మోహన్‌రాయ్‌

106. రాజా రామ్మోహన్‌రాయ్‌ స్థాపించిన సంస్థలు? - ఆత్మీయసభ, బ్రహ్మసమాజం

107. 1829లో సతీసహగవునాన్ని ఎవరు నిషేధించారు? - విలియం బెంటిక్‌

108. పోలీసు సర్వీసును ప్రవేశపెట్టింది? - కారన్‌ వాలీస్‌

109. 1856లో హిందూ విధవా పునర్వివాహ చట్టాన్ని తెచ్చినవారు? - డల్హౌసీ

110. 1835లో ఎవరి సిఫార్సుల ప్రకారం బెంటిక్‌ ఇంగ్లీష్‌ను బోధన భాషగా ప్రవేశపెట్టారు? - మెకాలే

0 Comments

Govt. Jobs


Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Admissions


Current Affairs


General Knowledge