రాశి ఫలాలు (29-10-2022)


వారం: శనివారం 

తిథి: చవితి ఉ.10:19 వరకు తదుపరి పంచమి 

నక్షత్రం: జ్యేష్ఠ మ.12:01 వరకు తదుపరి మూల 

శుభసమయం: సా.3:20 నుండి సా.4:20 వరకు 

దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.7:36 వరకు

రాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు

యమగండం: మ.1:30 నుండి మ.3:00 వరకు

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగినంత ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.


వృషభం

ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి.


మిధునం

స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.


కర్కాటకం

శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


సింహం

వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.


కన్య

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.


తుల

వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. సోదర స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.


వృశ్చికం        

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


ధనస్సు

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. వ్యాపారములను విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

 

మకరం

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.


కుంభం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.


మీనం

ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు.  

0 Response to "రాశి ఫలాలు (29-10-2022)"