యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 16
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 11
- టెక్నికల్ అడ్వైజర్ పోస్టులు: 1
- అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ పోస్టులు: 1
- రీడర్ పోస్టులు: 1
- సీనియర్ లెక్చరర్ పోస్టులు: 2
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎండీ ఎంఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఆగస్టు 11, 2022.