బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం ఖాళీలు – 89 పోస్ట్‌లు
- వర్క్ అసిస్టెంట్-A 72 పోస్టులు
- డ్రైవర్ – 11 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III – 6 పోస్టులు
అర్హతలు : వర్క్ అసిస్టెంట్ - గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనో - ఇంగ్లీష్ స్టెనోగ్రాఫ్లో నిమిషానికి కనీసం 30 పదాల టైపింగ్ వేగంతో టైప్ చేయాలి. అంతే కాకుండా 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. డ్రైవర్ - 10వ తరగతి ఉత్తీర్ణత మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నేరుగా barc.gov.in/careers/recruitment లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు..అభ్యర్థులు రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 01 జూలై 2022
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2022