ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 38 పోస్టులను భర్తీ చేయనున్నారు
ఖాళీ వివరాలు
- అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్/స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ ఎంట్రీ): 21 పోస్టులు
- అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్/స్టెనోగ్రాఫర్ (LDCE): 17 పోస్టులు
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :: ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము :: దరఖాస్తు రుసుము రూ. 100/- ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు, మహిళలు, మాజీ సైనికులు అభ్యర్థుల రుసుము నుండి మినహాయించబడింది.
ఆసక్తి గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 8న ప్రారంభమై జూలై 7, 2022న ముగుస్తుంది