Type Here to Get Search Results !

తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు, లైన్ మెన్, ఇంజనీర్ జాబ్స్ | TSSPDCL Jobs 2022

తెలంగాణ విద్యుత్ శాఖలో మరో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎస్పీడీసీఎల్‌లో 70 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా, మరో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు, 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

  • 1.జూనియర్‌ లైన్‌మెన్‌: 

మొత్తం పోస్టులు 1000 ఉన్నాయి. ఇందులో లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ 553, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ 447 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు పాసవ్వాలి. 2022, జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరసం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: మే 19

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8

హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 11

రాతపరీక్ష: జూన్‌ 17

వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

  • 2.సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు:

మొత్తం పోస్టులు 201 పోస్టులున్నాయి. ఇందులో లిమిటెట్‌ రిక్రూట్‌మెంట్‌ 19, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ 182 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా గానీ, డిగ్రీ గాని చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2022, జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌ లైన్‌ 

అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరసం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 15

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 5

హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్‌: జూలై 23

రాతపరీక్ష: జూలై 31

వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad