న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీల సంఖ్య: 22
ఖాళీల వివరాలు:
- వర్క్స్ ఇంజనీర్ పోస్టులు: 8
- సీనియర్ వర్క్స్ ఇంజనీర్ పోస్టులు: 5
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 3
- ఆర్కిటెక్ట్ పోస్టులు: 1
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు.
ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే 11, 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అడ్రస్: ఇర్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, బీ 40 ఏ, బ్లాక్ బీ, సెక్టార్ 01, నోయిడా, యూపీ.
Website : https://www.irconisl.com/