చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 12 క్లర్క్/ జేజీఎం పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, హాకీ, వాలీబాల్ వంటి క్రీడాంశాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు సంబంధిత క్రీడల్లో జాతీయ స్థాయి/ జూనియర్/ సీనియర్ నేషనల్స్‌లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : అభ్యర్థులను మొదట దరఖాస్తుల స్క్రీనింగ్, ట్రయల్స్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 30-04-2022న మొదలై 14-05-2022తో ముగియనుంది.
వెబ్సైట్ : https://www.indianbank.net.in/