కడప నగరంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నేడు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి తెలియజేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నట్లు వివరించారు. పది, ఇంటర్ చదివిన వారు అర్హులని చెప్పారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, పాన్ కార్డ్, రెండు ఫోటోలు తీసుకురావాలని చెప్పారు.