Type Here to Get Search Results !

రైల్వేలో 2972 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైన వాళ్లు అర్హులు | Railway Jobs 2022

ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2972 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైంది. మే 10, 2022 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు: 2972

  • హౌరా డివిజన్ – 659 పోస్టులు
  • లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
  • సీల్దా డివిజన్ – 297 పోస్టులు
  • కంచరపర డివిజన్ – 187 పోస్టులు
  • మాల్డా డివిజన్ – 138 పోస్టులు
  • అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
  • జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు

అర్హత: ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25, 2022 నుండి ప్రారంభమైంది. మే 24, 2022 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://cris.org.in/ చూడొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad