నిరుద్యోగులకు ఎలాంటి శిక్షణ లేకుండా నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పధక సంచాలకులు మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో కంపెనీలో ఉద్యోగాలకు మే నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కడప పట్టణము నుండి రాజంపేట కు వచ్చే ప్రధాన రహదారిలో జేఎంజె కాలేజీ వద్దగల టిటిడిసి నందు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫోటోలు, ఆధార్ కార్డు నకళ్ళతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని మధుసూదన్ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.
కడపలో మే నెల 24న జాబ్ మేళా | Kadapa Job Mela
మే 23, 2022
0