11 జనవరి, 2022

విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు | Visakha Cooperative Bank Recruitment 2022

విశాఖపట్నంలోని ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(వీసీబీఎల్).. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 30 

» అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూ టర్ నాలెడ్జ్ తోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి. 

» వయసు: 31.12.2021 నాటికి 20 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం :ప్రారంభంలో నెలకు రూ.35,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 11.01.2022 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022 

» వెబ్ సైట్: www.vcbl.in