11 జనవరి, 2022

నిరుద్యోగులకు శుభవార్త ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్ సీ).. తెలంగాణ డివిజన్ ఆఫీస్... అసిస్టెంట్ మేనే జర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 20 

» పోస్టుల వివరాలు: 

అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)-06, 

అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)-07, 

అసిస్టెంట్ మేనేజర్(లా) -07.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ(ఇంటర్), ఎంబీఏ/పీజీ డీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అను భవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.. 

» వయసు: 01.11.2021 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం: నెలకు రూ.52,713 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అపిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్-ఫై నాన్షియల్ అవేర్నెస్ విభాగాల్లో పరీక్ష నిర్వహి స్తారు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థు లను ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 

» వెబ్ సైట్: https://esfc.telangana.gov.in