11 జనవరి, 2022

ఆంధ్రప్రదేశ్ 108 లో ఉద్యోగాలు, నెలకు 20 వేల జీతం

మచిలీపట్నం జిల్లాలోని 108 సర్వీసుల్లో ఎమర్జన్సీ మెడికల్ టెక్నీ ఎయన్ (ఈఎంటీ)గా పనిచేసేం దుకు ఆసక్తి ఉండి అర్హులైన అభ్య ర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లామేనేజర్ సురేష్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని కృత్తి వెన్ను, గుడ్లవల్లేరు. నందివాడ, విజయవాడ, తోట్లవల్లూరు, పమిడి ముక్కల, గన్నవరం, ఉంగుటూరు, నున్న మండలాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 

బీఎస్సీ (బయాలజీ.) జీఎమ్లం, బీఎస్సీ నర్సింగ్, ఏఎస్సీ, ఎంఎల్ లో కోర్సులు చేసి, 30 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని తెలిపారు. రూ.20 వేల వేతనంతో పాటు ఈఎప్స్, గ్రూపు ఇన్సూరెన్సు వంటి సౌక ర్యాలు వర్తిస్తాయని వివరించారు. ఆసక్తి గలవారు విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం లోని డీఈ ఎంఓ ఆఫీసుకు ఎదురుగా ఉన్న బ్లాక్ లో మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల మధ్య నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.