29 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ప్రోగ్రామ్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్ లో.. ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 27 

» పోస్టుల వివరాలు: కన్సల్టెంట్స్, స్టేట్ ఎపిడిమియాలజిస్ట్, ఆశా టీమ్ లీడర్/ఆశా మేనే జర్, వెటర్నరీ ఎపిడిమియాలజిస్ట్, పీడియాట్రీషియన్స్, బయోమెడికల్ ఇంజనీర్, టీబీ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/బీడీఎస్/ఆయుష్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.19,019 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 3.12.2021 

» వెబ్ సైట్: https://cfw.ap.nic.in