26 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

అమరావతిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రులలో మెడికల్, పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఖాళీలు: 794 

విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల ఖాళీలు: 86 

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. 

డెంటల్ అసిస్టెంట్  సర్జన్  ఖాళీలు: 16 

అర్హత: బీడీఎస్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఖాళీలు: 839 

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. 

శానిటరీ అటెండెంట్ కం వాచ్మన్ ఖాళీలు: 312 

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత 

గ్రేడ్ 2 ఫార్మసిస్టు ఖాళీలు: 17 అర్హత: డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ "పారామెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మెడికల్ పోస్టులకు డిసెంబరు 1, పారా మెడికల్ పోస్టులకు డిసెంబరు 5 పూర్తి సమాచారం కోసం జిల్లాల వెబ్ సైట్లను చూడవచ్చు.