24 నవంబర్, 2021

కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ఉద్యోగాల భర్తీకి ప్రకటన

మినీరత్న కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమి టెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 70 

» పోస్టుల వివరాలు:  సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు

» సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు: విభాగాలు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, 

అర్హత: - కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జె క్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు వివిధ నైపు ణ్యాలు ఉండాలి. 

వయసు: 03.12.2021 నాటికి 85 ఏళ్లు మించకూడదు. వేతనం మొదటి ఏడాది నెలకు రూ.47,000, రెండో ఏడాది నెలకు రూ.48,000, మూడో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు. 

» ప్రాజెక్ట్ ఆఫీసర్లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రి కల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలు. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జె క్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు వివిధ నైపు ణ్యాలు ఉండాలి. వయసు: 03.12.2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు. వేతనం మొదటి ఏడాది నెలకు రూ.37,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 

» వెబ్ సైట్: https://cochinshipyard.in