25 నవంబర్, 2021

వైఎస్సార్ కడపలో 30 ఆశావర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్ కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ.. ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 30 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక మహిళలై ఉండాలి.

» వయసు: 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి. 

» వేతనం: ఇన్సెంటివ్ పద్దతిలో రూ.10,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. 50 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా కేటాయిస్తారు. మరో 50 మార్కులు లోకల్ స్టేటస్, సర్వీస్ ఆధారంగా కేటాయిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

» దరఖాస్తు విధానం:  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెవో, కడప చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021 

» వెబ్ సైట్: https://kadapa.ap.gov.in