2 అక్టోబర్, 2021

EBC (Economically Backward Classes) నేస్తం పథకం 2021-22 సంవత్సరానికి సంబంధించిన అప్డేట్

EBC (Economically Backward Classes) నేస్తం పథకం 2021-22 సంవత్సరానికి సంబంధించిన అప్డేట్.

*ఈబీసీ నేస్తం పథక పూర్తి సమాచారం :*


*1. పథకం పేరు :* ఈబీసీ నేస్తం

*2. ముఖ్య ఉద్దేశం :* GO విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ [EBC] మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం కోసం ఆర్థిక సాయం అందించటం.

*3. ఆర్థిక సాయం  :* సంవత్సరానికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు.


*4. 2021-22 బడ్జెట్ :* సంవత్సరానికి 670-605 కోట్లు అలా మూడు సంవత్సరాలు కు  1810-2011 కోట్లు.


*5. అర్హతలు  :*

 i. వైయస్సార్ చేయూత మరియు కాపు నేస్తం లో ముందుగా కవర్ అయినటువంటి ఎస్సీ , ఎస్టీ , బిసి మైనారిటీ మహిళలు అర్హులు కారు. *కేవలం ఈబిసి మహిళలు మాత్రమే అర్హులు.*


ii. తప్పకుండా ఆధార్ కార్డ్ అనేది వారి పేరు మీద ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బుక్కు కూడా వారి పేరు మీద ఉండాలి.


iii. కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10,000 దాటకూడదు అదేవిధంగా పట్టణాలలో అయితే నెలకు 12000 దాటకూడదు.


iv. ఈ కుటుంబం మొత్తానికి పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా పల్లపు భూమి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.


v. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని పెన్షనర్ గాని ఉండకూడదు. (పారిశుద్ధ్య కార్మికులు అర్హులు.)


vi. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. (టాక్సీ ఆటో టాక్టర్ ఉంటే పర్లేదు)


vi. కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు  ఉండకూడదు.


vii. మునిసిపాలిటీ లో ఉన్నటువంటి భూమి 750 స్క్వేర్ ఫీట్లు కన్నా తక్కువగా ఉండాలి.


viii. వయసు : GO విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలు అర్హులు.


*డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ లు :*

1. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ( డేట్ అఫ్ బర్త్ ఉంటేనే )

2. బర్త్ సర్టిఫికెట్ / 10వ తరగతి సర్టిఫికెట్

3.ఆధార్ కార్డు 


*6. అర్హుల ఎంపిక, ఆమోదం మరియు శాంక్షన్ ప్రాసెస్ :*

i. సచివాలయ లో ఉన్నటువంటి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే అనేది చేసి అర్హులను ఎంపిక చేస్తారు.


ii. ఎంపిక చేసేటప్పుడు అవసరం అయ్యే విషయాలు:

•పేరు 

•ఆధార్ నంబర్

•ఫోన్ నంబర్

•కుటుంబ పెద్ద పేరు 

•కుటుంబ పెద్ద ఆధార్ కార్డు నంబర్

•కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ 

• జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ 

•కుటుంబ మొత్తం ఆదాయం 

•బ్యాంకు అకౌంట్ పాసుబుక్ కాపీ 

•అకౌంట్ నెంబర్ / IFSC కోడ్ /బ్రాంచ్ పేరు 

•4 వీలర్ ఉంటే వెహికల్ నెంబర్ 

•భూమి వివరాలు (పళ్ళము / మెట్ట )

•మున్సిపాలిటీ ప్రాపర్టీ వివరాలు 

•గవర్నమెంట్ ఎంప్లొయ్/ పెన్సనర్ స్టేటస్ 

iii. గ్రామ వార్డు వాలంటీర్లు సర్వే చేసే ముందు అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

iv. వాలంటీర్లు సర్వే చేసిన తరువాత  సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వాలిడేషన్ చేస్తారు.

తరువాత సంబంధిత ఎంపీడీవో / మునిసిపల్ కమిషనర్ ప్రూఫ్ లను పరిశీలించి అప్లికేషన్లను స్క్రూటినీ చేసి BC కార్పొరేషన్ యొక్క ED వారికి ఫార్వర్డ్ చేస్తారు, వారు జిల్లా కలెక్టర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు, అక్కడ వెరిఫికేషన్ చేసి 

అప్రూవల్ లిస్ట్ ను AP STATE Welfare and Development Corporation ఫైనల్ శాంక్షన్ చేసి అమౌంట్ బడ్జెట్ అనుగుణం గా వేస్తారు.

*7. వెబ్ సైట్ :* దీని యొక్క పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి నవశకం లాగిన్ లో అవుతుంద

*అర్హతలు:-*

1. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి

2. రైస్ కార్డు కలిగి ఉండాలి

3. స్త్రీ లకు మాత్రమే అర్హత.

4. వయసు: September,29 2021 నాటికి 45 సం.లు కంటే ఎక్కువ మరియు  60 సం.లు లోపు వుండాలి.

5. *గతములో వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం పధకాలకు అప్లై చేసిన లబ్ధిదారులు అనర్హులు*


*లబ్ది :-*

    సంవత్సరానికి ₹ 15,000 రూపాయలు ఇస్తారు.


*సేకరించల్సిన డాక్యుమెంట్లు:-*

1. అప్లికేషన్ ఫారం 

2. ఆధార్ కార్డు జిరాక్స్

3. రైస్ కార్డు జిరాక్స్

4. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్

5. EBC కుల ధ్రువీకరణ పత్రం

6. ఆదాయ ధ్రువీకరణ పత్రం

7. ఆధార్ అప్డేట్ హిస్టరీ