20 అక్టోబర్, 2021

పోస్టు పేమెంట్స్ బ్యాంక్ నుండి జాబ్ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)..ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 21

” పోస్టుల వివరాలు: 

1) మేనేజర్, 

2) సీనియర్ మేనేజర్, 

3) చీఫ్ మేనేజర్, 

4) అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 

5) జనరల్ మేనేజర్ తదితరాలు.

» విభాగాలు: ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ తదితరాలు.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.

» వయసు: పోస్టుల్ని అనుసరించి 23-55 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.94,000 నుంచి రూ.2,92,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్ |ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.10.2021

వెబ్ సైట్: www.ippbonline.com