25 అక్టోబర్, 2021

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» పోస్టులు: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్  

» మొత్తం పోస్టుల సంఖ్య: 3898

జిల్లాల వారీగా ఖాళీలు

»  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం -638; 

» ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా-1003; 

» గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-786; 

» చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు-971. 

» అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. 

» వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి. 

- దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021 

» వెబ్ సైట్: https://cfw.ap.nic.in/MLHP2021.html