21 అక్టోబర్, 2021

అయ్యయ్యో వద్దమ్మా అనకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 7855 ఖాళీలను ప్రకటించింది. జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి ఐబీపీఎస్ ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో 5,830 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇప్పుడు పోస్టుల సంఖ్యను 7855 కి పెంచడం విశేషం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 అక్టోబర్ 27 లోగా దరఖాస్తు చేయాలి. జూలై 12 నుంచి 14 మధ్య అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

ఐబీపీఎస్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన క్లర్క్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెరిగింది. మొదట రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో 5,830 క్లర్క్ పోస్టుల్ని ప్రకటిస్తే, తాజా నోటిఫికేషన్ ద్వారా 7855 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఐబీపీఎస్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 7855 క్లర్క్ పోస్టులున్నాయి.


దరఖాస్తు ప్రారంభం: 2021 అక్టోబర్ 7

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 అక్టోబర్ 27

దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2021 అక్టోబర్ 27

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2021 నవంబర్

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: 2021 నవంబర్

ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2021 నవంబర్ లేదా డిసెంబర్

ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2021 డిసెంబర్

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల: 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి

మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి

మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ : 2022 జనవరి లేదా ఫిబ్రవరి

ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2022 ఏప్రిల్

మరిన్ని వివరాలకు ఈ లింక్ https://ibpsonline.ibps.in/crpcl11jun21/పై క్లిక్ చేయండి.