20 అక్టోబర్, 2021

ఐటిఐ చేసి ఖాళీగా ఉన్నారా.. తుమ్మలపల్లి లో జాబ్స్ ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. 2021-22 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 30 

» విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్ డీజిల్, టర్నర్ /మెషినిస్ట్.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్వీసీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 02.11.2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021

వెబ్ సైట్: www.ucil.gov.in