20 అక్టోబర్, 2021

నిరుద్యోగులకు శుభవార్త. . . రైల్వేలో 4,103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 4,103 ఖాళీలను భర్తీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లలో ఈ అప్రెంటీస్ పోస్టులున్నాయి. సికింద్రాబాద్, కాజిపేట్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే.

దక్షిణ మధ్య రైల్వే మొత్తం 4,103 పోస్టుల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3 లాస్ట్ డేట్. దక్షిణ మధ్య రైల్వే భర్తీ చేస్తున్న 4,103 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. 10+2 విధానంలో చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పాస్ కావాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయకూడదు. అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. 

మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. అభ్యర్థులు 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో, ఐటీఐ ఎగ్జామ్‌లో సాధించిన మార్కులకు సమాన వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే ఎక్కువ వయస్సు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఎవరు ముందు పాస్ అయ్యారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి ఒక ఏడాది అప్రెంటీస్ ఉంటుంది. సెంట్రల్ అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.

మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.. http://20.198.104.232/instructions.php