20 అక్టోబర్, 2021

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 11,775 వైద్య పోస్టుల భర్తీ

ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ హెల్త్  క్లినిక్ నుంచి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా, బోధనాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్మెంట్ కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు.  వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ ఇలా... 

భర్తీ చేసే పోస్టుల సంఖ్య

మొత్తం పోస్టుల భర్తీ 11,775

1) డైరెక్టర్, మెడికల్ విద్య  4,142

2) ఏపీ వైద్య విధాన పరిషత్ 2,873

3) పబ్లిక్ హెల్త్ కుటుంబ సంక్షేమం 4,760

పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్ సీల నిర్మాణం కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు.