22 అక్టోబర్, 2021

గవర్నమెంట్ ఐటిఐ లో 100 పోస్టులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ పి.వి.రమేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

సంస్థ పేరు :  అపోలో ఫార్మసీ 

1) ఫార్మసిస్టు పోస్టులు 50, 

2) అసిస్టెంట్ ఫార్మసిస్టు పోస్టులు 30, 

3) ఫార్మసీ ట్రైనీ పోస్టులు 20 

అర్హతలు :   పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీలో మాస్టర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని వివరించారు. 

ఆసక్తిగలవారు ఎన్‌సీ ఎస్.జీఓవీ.ఇన్ వెబ్ సైట్లో జాబ్ సీకర్‌లో వివ రాలు నమోదు చేసుకుని, తమ మొబైల్ నంబ రుకు వచ్చే ఐడీ ద్వారా శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే జాబ్ మేళాకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.