4 అక్టోబర్, 2021

నేటి రాశి ఫలితాలు (04-10-2021)

 వారం: సోమవారం

తిథి: త్రయోదశి రా.7:22 వరకు
నక్షత్రం: పుబ్బ రా.2:26 వరకు
శుభసమయం: ఉ.7:20
దుర్ముహూర్తం: మ.12.10 నుండి మ.12.57 వరకు
పునః మ.2:20 నుండి మ.3:17 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు

మేషం
నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం
ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

మిధునం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర హారాలు ఉండవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం
చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

సింహం
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.

కన్య
దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

తుల
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు
నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం
చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం
ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి