2 అక్టోబర్, 2021

నేటి రాశి ఫలితాలు (02-10-2021)

 వారం: శనివారం

తిథి: ఏకాదశి రా.07:49 వరకు

నక్షత్రం: ఆశ్లేష రా.1:46 వరకు

శుభసమయం: ఉ.11:15

దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.07.30 వరకు

రాహుకాలం: ఉ.09.30 నుంచి ఉ.10.30 వరకు

యమగండం: మ.01:30 నుండి మ.03:00 వరకు



మేషం


సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.


మిధునం


చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు . ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.


కర్కాటకం


సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.


సింహం


దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఇంటాబయటా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.


కన్య


దీర్ఘకాలిక వివాదాల నుంచి బయట పడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారము న ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.


తుల


దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.


వృశ్చికం


చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.


ధనస్సు


వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.


మకరం


సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.


కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.


మీనం


చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.