5 మార్చి, 2021

పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో నావికా దళంలో ఉద్యోగావకాశం

నిరుద్యోగ యువతకు శుభవార్త. కేవలం పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో నావికా దళంలో ఉద్యోగావకాశం, మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు. కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌లలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. 

ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET) ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.

మొత్తం ఖాళీలు:1159

1) హెడ్‌ క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్- విశాఖపట్నం: 710

2) హెడ్‌ క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్- ముంబై: 324

3) హెడ్ ‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్- కొచ్చి: 125

అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.205/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 22న ప్రారంభం అయింది. మార్చి 7 దరఖాస్తులకు చివరి తేదీ.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 22, 2021.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 07, 2021.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/