5 మార్చి, 2021

టెన్త్, ఇంటర్ పాసైనవారికి శుభవార్త | సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 459 ఖాళీలను ప్రకటించింది. జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్‌లో మొత్తం 7 ట్రేడ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. 

సంస్థ పేరు :  బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO

మొత్తం ఖాళీలు- 459 (అన్‌రిజర్వ్‌డ్- 195, ఎస్సీ- 66, ఎస్టీ- 32, ఓబీసీ- 121, ఈడబ్ల్యూఎస్-45)

ఉద్యోగాల వివరాలు : 

1) డ్రాఫ్ట్స్‌మ్యాన్- 43

2) సూపర్‌వైజర్ స్టోర్- 11

3) రేడియో మెకానిక్- 4

4) ల్యాబ్ అసిస్టెంట్- 1

5) మల్డీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- 100

6) మల్డీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)- 150

7) స్టోర్ కీపర్ టెక్నికల్- 150

విద్యార్హతలు- టెన్త్, ఇంటర్, డిగ్రీ

వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు

జీతం వివరాలు 

డ్రాఫ్ట్స్‌మ్యాన్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 5 (రూ.29200-92300)

సూపర్‌వైజర్ స్టోర్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 (రూ.25500-81100)

రేడియో మెకానిక్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 (రూ.25500-81100)

ల్యాబ్ అసిస్టెంట్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 3 (రూ.21700-69100)

మల్డీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 (రూ.18000-56900)

మల్డీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 (రూ.18000-56900)

స్టోర్ కీపర్ టెక్నికల్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 2 (రూ.19900-63200)

ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్

దరఖాస్తు విధానం ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారిక వెబ్‌సైట్ http://bro.gov.in/ లో చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. http://bro.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్-

Commandant GREF Centre,

Dighi Camp,

Pune 411015.

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 4