3 మార్చి, 2021

కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. ఎక్స్-ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. 

సంస్థ పేరు :-సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్

మొత్తం ఖాళీలు- 2000

ఖాళీల వివరాలు :- 

ఎస్సై- 63

ఏఎస్సై- 187

హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424

కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326

అర్హతలు- ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే అప్లై చేయాలి.

సాలరీ:- 

ఎస్సై- రూ.40,000

ఏఎస్సై- రూ.35,000

హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000

కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.25,000

వయస్సు- 50 ఏళ్ల లోపు

ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15

దరఖాస్తు విధానం- ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్‌ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.