5 మార్చి, 2021

8వ తరగతితోనే పోలీస్ జాబ్ పొందండి | మొత్తం 296 పోస్టులు

హోం గార్డ్, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో హోమ్ గార్డ్ వాలంటీర్ల పోస్టుల భర్తీకి హోమ్ గార్డ్ , సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, గోవా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 296 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు 8వ తరగతి పాసై ఉండాలి. మగవాళ్లైతే ఎత్తు 5.5 అడుగులు ఉండాలి. ఆడవాళ్లైతే 4.11 అడుగులు ఉండాలి. 20 ఏళ్లు నుంచి 50 ఏళ్ల వరకూ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరిన వారికి రోజుకు రూ.704లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. 


రిటన్ టెస్ట్‌లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రాత పరీక్షలో 40 శాతం మార్కులు సంపాదించాలి. ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే అప్లై చేసుకోవాలి. అలాగే మూడేళ్ల కాల వ్యవధితో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలతో నింపిన దరఖాస్తును, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లను జత చేసి కమాండెంట్ జనరల్ హోమ్ గార్డ్స్ అండ్ డైరెక్టర్, సివిల్ డిఫెన్స్, పనాజీ - గోవా కార్యాలయానికి పంపించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.