3 మార్చి, 2021

10వ తరగతి అర్హతతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్ష‌న్స్ మంత్రిత్వ‌శాఖ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) పలు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి అర్హతతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం: మ‌ల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నిక‌ల్‌) స్టాఫ్ ఎగ్జామినేష‌న్ 2020

మొత్తం ఖాళీలు: ఖాళీల‌కు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈసారి కూడా దాదాపు అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది.

అర్హ‌త‌: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేష‌న్ (ప‌దో త‌ర‌గ‌తి) ప‌రీక్ష‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త ఉండాలి‌.

వ‌య‌సు: వివిధ విభాగాల‌ను అనుస‌రించి 01.01.2021 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ య‌వ‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు:

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: అభ్యర్థులు పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.  ఫిబ్రవరి 05, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: మార్చి 21, 2021.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: మార్చి 23, 2021.

చ‌లాన ద్వారా ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: మార్చి 29, 2021.

కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్ (టైర్‌-1): 01.07.2021 నుంచి 20.07.2021 వ‌ర‌కు.

టైర్‌-2 ప‌రీక్ష తేది (డిస్క్రిప్టివ్ పేప‌ర్): నవంబర్‌ 21, 2021.

వెబ్‌సైట్‌:https://ssc.nic.in/