25 జనవరి, 2021

Mega Job Notification 2021 | 249 ప్రభుత్వ ఉద్యోగాలు జీతం 50 వేలు పైనే

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (UPSC) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగాల వివరాలు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్.

మొత్తం ఖాళీలు : 249

1) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 116

2) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 80

3) స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 45

4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 06

5) అసిస్టెంట్ డైరెక్టర్ - 01

6) లెక్చరర్ - 01

అర్హత : డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి.

స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - MBBS / DNB / DM / M.Ch ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి.

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - డిగ్రీ (ఆయిల్ టెక్నాలజీ) / ఇంజనీరింగ్ / సైన్స్) ఉత్తీర్ణ‌త‌ తో పాటు పిజి డిప్లొమా అనుభవం కూడా ఉండాలి.

అసిస్టెంట్ డైరెక్టర్ - డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి.

లెక్చరర్ - మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి.

వయస్సు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ , డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 30 ఏళ్ళు మించకూడదు. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 40 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్ & లెక్చరర్ - 35 ఏళ్ళు మించకూడదు.

వేతనం : నెల‌కు రూ. 60,500-2,80,000/-.

ఎంపిక విధానం: రాత పరీక్ష , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌కియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 23, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 11, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here