12 జనవరి, 2021

APSRTC లో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) అతి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అతి త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది..

కాబట్టి ఆసక్తి ఉన్న పురుష, మహిళ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి..

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC )

పోస్టులు

1) డ్రైవర్ – 4158

2) కండక్టర్ – 5623

విద్యార్హతలు

౼ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

౼ కండక్టర్ – 10వ తరగతి పాసైతే చాలు

వయస్సు : 18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SC / ST/ BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

ఎంపిక విధానము : అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండానే, 10వ తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

నోటిఫికేషన్ :- త్వరలో విడుదల కానుంది.