14 నవంబర్, 2020

తూర్పు గోదావరి జిల్లా ONGC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్‌జీసీ యూనిట్‌లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఏపీలోని ఓఎన్‌జీసీ యూనిట్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 33 ఖాళీలను ప్రకటించింది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. 2022 జూన్ 30 కాలపరిమితి వరకు ఈ కాంట్రాక్ట్ పోస్టులుంటాయి.

మొత్తం ఖాళీలు- 33

1) కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ-FMO)- 28

2) కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO)ఫుల్ టైమ్- 3

3) కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) పార్ట్ టైమ్- 1

4) కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్-OH)- 1

 విద్యార్హతలు:- బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ- MBBS పాస్ కావాలి

వయస్సు:- గరిష్ట వయస్సు పరిమితి లేదు

వేతనం:- కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ-FMO) పోస్టుకు రూ.75,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) ఫుల్ టైమ్ పోస్టుకు రూ.72,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) పార్ట్ టైమ్ పోస్టుకు రూ.41,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్-OH) పోస్టుకు రూ.72,000.

ఎంపిక విధానం:- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నేరుగా లేదా వాట్సప్, స్కైప్, జూమ్, గూగుల్ మీట్, వెబెక్స్ లాంటి ఆన్‌ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఉంటుంది.

దరఖాస్తు విధానం:- నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ongcindia.com/ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తును చదివి అప్లై చేయాలి. నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇ-మెయిల్ ఐడీకి నవంబర్ 21లోపు పంపాలి. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం:- 2020 నవంబర్ 9

దరఖాస్తుకు చివరి తేదీ:- 2020 నవంబర్ 21

దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ:- recruitmentrajahmundry@ongc.co.in

అప్లికేషన్ ఫామ్‌తో పాటు పంపాల్సిన డాక్యుమెంట్స్:- రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, టెన్త్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ మార్క్స్ షీట్, సర్టిఫికెట్, పీజీ మార్క్స్ షీట్, సర్టిఫికెట్, అదనపు అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, సర్టిఫికెట్ ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్స్ స్కాన్ తీసి పంపాలి.