10 నవంబర్, 2020

క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలు || పక్కా గవర్నమెంట్ జాబ్స్ // డోంట్ మిస్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 15 చివరి తేదీ.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పలు ప్రభుత్వ విభాగాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో ఇంటర్ అర్హతతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది 

 ఉద్యోగాల వివరాలు:-  లోయర్ డివిజనల్ క్లర్క్-LDC, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-JSA, పోస్టల్ అసిస్టెంట్-PA, సార్టింగ్ అసిస్టెంట్-SA, డేటా ఎంట్రీ ఆపరేటర్-DEO లాంటి పోస్టులు ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు- ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించలేదు. https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy లో ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు. గతేడాది ఇదే నోటిఫికేషన్ ద్వారా 4893 LDC, JSA, PA, SA, DEO పోస్టుల్ని భర్తీ చేసింది.

విద్యార్హత- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ కావాలి. ఇతర పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ కావాలి.

వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2 ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.

ముఖ్యమైన తేదీలు:- 

నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 6

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 6 ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 15 రాత్రి 11.30 గంటలుఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 17 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 19 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 21 బ్యాంకు వేళలు ముగిసేవరకు

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్ 1)- 2021 ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 27

టైర్ 2 ఎగ్జామ్- టైర్ 1 ఫలితాల తర్వాత పరీక్ష తేదీలను వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

టైర్ 3- టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.