14 నవంబర్, 2020

నిరుద్యోగులకు శుభవార్త భారీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఇండియన్ ఆర్మీ తెలంగాణలో ఆర్మీ భారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతోంది.  సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది. 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. 

భర్తీ చేసే ఉద్యోగాలు:- సోల్జర్ టెక్ (AE, సోల్జర్ జనరల్ డ్యూటీ(GD,సోల్జర్ ట్రేడ్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ)

విద్యార్హతలు:- సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. సోల్జర్ టెక్ (AE) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి. సోల్జర్ Clk/SKT పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 50 శాతం మార్కులు ఉండాలి.

అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి. స్క్రీనింగ్ తేదీ నుంచి రెండేళ్లలోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా పాత సర్టిఫికెట్లు ఉంటే పరిగణలోకి తీసుకోరు. 

వయస్సు:- సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) కేటగిరీకి 17.5 నుంచి 21 ఏళ్లు, ఇతర కేటగిరీలకు 17.5 నుంచి 23 ఏళ్లు 

తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. airawat0804@nic.in మెయిల్ ఐడీకి మీ సందేహాలను పంపి సమాధానాలు తెలుసుకోవచ్చు.

ర్యాలీ జరిగే తేదీలు:- 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు

స్పోర్ట్స్ ట్రయల్ నిర్వహించే తేదీ:- 2021 జనవరి 15

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన అడ్రస్:

హెడ్ క్వార్టర్స్ ఏవోసీ సెంటర్, 

ఈస్ట్ మారేడుపల్లి, తిరుమల గిరి, 

సికింద్రాబాద్, 500015.